కోణార్క్ ఆలయం.; - డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 డిషా రాష్ట్రంలో పూరీ జిల్లాకు చెందిన ఒక మధ్యతరహా పట్టణం. ఇది బంగాళాఖాతం సముద్ర తీరాన ఆ రాష్ట్ర రాజధానికి భువనేశ్వర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక స్థలాలలో ఒకటి. ఇక్కడ నల్ల గ్రానైటు రాళ్ళతో కట్టిన పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గాంగ వంశానికి చెందిన నరసింహదేవుడు (1236 - 1264) నిర్మించాడు. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత ప్రదేశం. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలతో అలంకరించబడి ఉంది. ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడు బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది.
కోణార్కలో సముద్రతీరమున నిర్మించిన సూర్య దేవాలయము ఉంది. సూర్య గమనమునకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం అద్భుతాలలోకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది. రధానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమౌతుంటుంది.
పురాణ కాలంలో శాపగ్రస్తుడై కుష్టురోగం బారినపడ్డ శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కోణార్క్ దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్థం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆసమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యభగవానుడి విగ్రహం లభించింది. దాన్ని సాంబుడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించాడు. అయితే ప్రస్తుతమున్న ఆలయంలో పురాణకాలంలో స్థాపించబడ్డ విగ్రహం కన్పించదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే. ప్రస్తుతం కోణార్క్‌లో ఉన్న ఆలయాన్ని గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఆరోజుల్లో దాదాపు 12 వందల మంది శిల్పులు పన్నెండేళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ సూర్యదేవాలయములో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి.
ఆలయం రథాకారము కలిగి ఉంటుంది.
ఆలయాన పన్నెండు జతల చక్రాలు కలిగి ఉంటుంది.
దేవాలయముపైన పద్మము, కలశము ఆకర్షణీయముగా చెక్కబడి ఉన్నాయి.
ఖుజరహో మాదిరి ఇక్కడకూడా శృంగార రసభరిత శిల్పాలు విశేషంగా ఉన్నాయి.
ఇక్కడి సముద్రతీర ఇసుక బంగారపు వర్ణములో ఉండి తీర ప్రాంతము అందాలు చిందుతూ ఉల్లాసం కలిగిస్తుంది.
సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా పన్నెండు జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడుగురర్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు కచ్చితమైన సమయాన్ని చెప్పగలరు.
సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోణార్క్ ఆలయంలో మూల విరాట్టు లేకపోవడం కూడా ఓ చెప్పుకోదగ్గ విషయమే. అయితే ప్రతి ఏడాది ఇక్కడ రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.
కోణార్క్‌లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీ నారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి.
ఈ సమయంలో భక్తులు దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలను పూజిస్తారు. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్చు.
కోణార్కలో శ్రీ పరమేశ్వరస్వామివారి దేవస్థానము ఉంది. 1951లో నిర్మించినట్లుగా చెప్పే అరుణ స్తంభము ఉంది.
మంగళాదేవి తీర్ధము. పాల్మిలిబాంగ్ తీర్ధము. చంద్రబాగ్, చాయాదేవి తీర్ధములు ఉన్నాయి.
కోణార్కలో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమికి {రథసప్తమి} బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ప్రపంచ నలుమూలల నుండి వేలాదిగా తరలి వస్తారు.

కామెంట్‌లు