ఎస్ ఎల్ బి లో ఘనంగా వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాలు; వెంకట్ , మొలక ప్రతినిధి , వికారాబాద్

 -200 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ బహుకరించిన కవయిత్రి మొల్ల కళా సమితి
- ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో సత్తయ్య
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి సంఘం లక్ష్మీబాయి గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో సోమవారం వజ్రోత్సవ సంబరాల కార్యక్రమాల ముగింపులు ఘనంగా నిర్వహించుకున్నారు. రెండు వారాలుగా నిర్వహించుకున్న రోజువారి కార్యక్రమాలను అందులో పాల్గొన్న విద్యార్థులను విజేతలను ప్రశంసిస్తూ ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు. ఈ వజ్రోత్సవ ముగింపు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో సత్తయ్య, తిరుమల కళా సమితి అధ్యక్షుడు వెంకటేష్ ను సాంప్రదాయబద్ధంగా స్వాగతించి వేదికపైకి ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వజ్రోత్సవ కార్యక్రమాల నివేదికను ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ చదివి వినిపించారు.  రోజువారి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తూ విజేతలైన విద్యార్థినిలకు బహుమతుల ప్రధానం చేశారు   తాండూర్ కవయిత్రి మొల్ల కళా వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు ప్రశంస పత్రాలను బహుకరించారు స్వాతంత్ర ఉద్యమం విజయాలు సమరయోధులు భారత స్వాతంత్ర చరిత్ర గురించి ఉద్యమాల గురించి సమరయోధుల గురించి ఎంపీడీవో సత్తయ్య విద్యార్థులకు వివరించారు. సంఘంలో లక్ష్మీబాయి వంటి మాతృమూర్తులు బాలిక విద్య కోసం పాటుపడిన అంశాలను తెలియజేశారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మెడల్స్ అందజేసి అభినందించారు. పాఠశాలలో వజ్రోత్సవ కార్యక్రమాల్లో విజేతలైన 200 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు భవిష్యత్తులో బాగా చదువుకొని ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపీడీవో సత్తయ్యన కవయిత్రి మొల్లకళా వేదిక అధ్యక్షుడు వెంకట్ లను ప్రిన్సిపల్ సిబ్బంది సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు