మనకీర్తి శిఖరాలు.;-పాటిబండ్ల వెంకటపతిరాయలు.; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 పాటిబండ్ల వెంకటపతిరాయలు. ప్రముఖ కవి, రచయిత. ఈయన ఆంధ్రా గాంధీగా సుప్రసిద్ధులు. ఈయన ఉభయభాషా ప్రవీణుడు. తెలుగు, హిందీ, సంస్కృతంలో ప్రావీణ్యతతో పలు పుస్తకాలు వ్రాసారు. హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసారు.
ఆయన 28 డిసెంబర్‌ 1914లో పాటిబండ్ల కోటయ్య, లక్ష్మిదేవి గార్ల కలల పంటగా కృష్ణాజిల్లా వీరులపాడు గ్రామంలో జన్మించారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. అన్న పాటిబండ్ల వెంకటరామయ్య చౌదరి మంచి కవి, పండితుడు. వెంకటపతిరాయల గారి చదువు స్థానికంగా ఉన్న తిలక్ జాతీయ పాఠశాలలో కొనసాగింది. ఆయన సాహిత్య గురువు జంగ హనుంత చౌదరి గారు.సాహిత్యంలో అనేక విషయాలను ఆయనవద్దనే నేర్చుకున్నారు.ఆయన చదువు మధ్యలో అర్థాంతరంగా ఆగిపోయింది.తరువాత హిందీ భాషా ప్రవీణ చదివి హిందీ ఉపాధ్యాయులుగా చేరారు. రాయలగారికి అన్నపూర్ణతో వివాహమైనది. 1972 లో వారు నిజామాబాదులో స్థిరపడ్డారు. ఆయన ఎనిమిది పుస్తకాలను రచించి ప్రచురించాడు. వాటిలో దేశంలో దేవాలయాలు అనే పుస్తకం ప్రముఖమైనది. ఆయన దేశవ్యాప్తంగా కలినడకన 12 సంవత్సరాలపాటు పర్యటించారు.
మహాత్మా గాంధీ సహాయనిరాకరణ, స్వదేశీ పిలుపుతో ఆయన కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. చిన్నప్పటి నుండి ఖాదీ వస్త్రధారణపై మక్కువ ఎక్కువ.పాఠశాలకు కూడా ఖాదీ వస్త్రధారణ చేసేవారు.దేశంలోవివిధ ప్రాంతాలలో పర్యటించినపుడు ఆయనను "ఆంధ్రా గాంధీ" అని పిలిచేవారు.
ఆయనకు ఇద్దరు కూమరులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు పి.రామమోహనరావు సీనియర్ డాక్టరు, రాష్ట్ర జనవిజ్ఞాన పరిషత్ కు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. పెద్ద కోడలు డా జయనీ నెహ్రూ. చిన్న కుమారుడు కోటేశ్వరరావు బొంబాయి ఐ.ఐ.టి చదివాడు. కుమార్తె సరళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.
పాటిబండ్ల అక్కయ్య వంశ చరిత్ర.
మిత్ర ప్రబోధ (432 శతక పద్యాలు)
ఆలయాలు అచటి విశేషాలు
నా దక్షిణ భారత యాత్రా విశేషాలు
నా ఉత్తర భారత యాత్రా విశేషాలు
నాలో నేను (ఆత్మకథ)
బుద్ధం శరణం గచ్ఛామి
ఆయన 27-4-2015 న నిజామాబాద్‌లోలో మరణించారు.


కామెంట్‌లు