పరీక్ష! అచ్యుతుని రాజ్యశ్రీ

 టీచర్ బోర్డు మీద కావాలనే అక్కడక్కడ అక్షర దోషాలు (స్పెల్లింగ్ మిస్టేక్స్)రాస్తుంది.ముఖ్యంగా తెలుగు హిందీ  ఇంగ్లీషు టీచర్లు కావాలి అనే అలాచేస్తారు.ఎందుకో తెలుసా?పిల్లలు టెక్ట్స్ బుక్ చూసి చదవాలి రాయాలి.తెలివిగల పిల్లలు వెంటనే "టీచర్!స్పెల్లింగ్ తప్పు" అని మొహమాటం లేకుండా చెప్పి పుస్తకంలోది చూపుతారు. ఇది మంచి పద్ధతి. టీచర్ కూడా విసుగు కోపం ప్రదర్శించకుండా"శెభాష్!ఇలా తప్పులు  పట్టాలి"అని ప్రోత్సహిస్తుంది.ఆరోజు టీచర్ ఓకథ చెప్పసాగింది."పూర్వం విద్యార్ధులు గురుకులంలో చదువుకుంటూ ఆయన రాకపోకలు  చెప్పి ఆచరిస్తున్నాడా ?కేవలం తమకు మాత్రమే చెప్పి నీతులు పిల్లలకు తనుమాత్రం  ఇష్టానుసారం చేస్తున్నాడా అని గమనించేవారు.ఓశిష్యుడు గురువు పడుకునే దుప్పటి కింద ఆరోజు ఓధనికుడు ఇచ్చిన చిన్న డబ్బు మూట పెట్టాడు.గురువు గారు రోజూ "మనకు కావాల్సినంత మనం వాడుకుని మిగతాది నిస్సహాయులకు ఆపదలో ఉన్న వారికి  వస్తురూపేణ ఇద్దాం" అని చెప్పేవారు. డబ్బు దానం చేస్తే దుర్వినియోగం కావచ్చు. కాసేపటికి గురువుగారు వచ్చి తన పడకపై వాలాడు.శిష్యుడు నిద్రనటిస్తూ చూస్తున్నాడు. ఓ ఐదు నిమిషాలు కాగానే "నాయనా శివా!నావీపు అంతా దురదలు! చిమచిమ లాడుతోంది"అని లేపాడు.శివా ఆయన దగ్గరికి వెళ్లి "చీమ దోమ కూడా  లేదు.దుప్పటి శుభ్రంగా  నేనే రోజూ లాగా ఉతికి ఆరేశాను"అన్నాడు.సరే నని పడుకున్నాడు ఆయన. మళ్ళీ వెంటనే పెద్దగా గావుకేకలు వేయసాగాడు మంటలతో శరీరం కుతకుతలాడుతోంది అని.మిగతా ఇద్దరు శిష్యులు లేచారు "గురూజీ!మేము దుప్పటి కింద ఉన్న చాపకూడా దులుపుతాము లేవండి" అని మొత్తం దులుపుతుంటే ఓచిన్న డబ్బుమూట కనపడింది. "ఆ!ఎవరు పెట్టారు దీన్ని?" ఆశ్చర్యంగా అడిగాడు ఆయన. ఆరోజు కొత్తగా చేరిన శిష్యుడు అన్నాడు "ఈరోజు ఒక ధనికుడు కొంత డబ్బు ఇచ్చి వెళ్లాడు.మీదగ్గర ఐతే భద్రంగా ఉంటుంది అని అంతా చెప్పటంతో నేనే పెట్టాను." కావాలని గురువుని పరీక్షించాలని దొంగనిద్ర నటించిన శిష్యుడు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు. " 
టీచర్ ఈకథ చెప్పి "నేను కావాలనే తప్పులు రాస్తున్నాను. మీరు అచ్చుపుస్తకం చూడాలి. ధైర్యం గా టీచర్ ని ప్రశ్నించాలి.అప్పుడే పోటీతత్వం ఆసక్తి పెరుగుతుంది.మక్కికి మక్కి ఎక్కించి కాపీ కొడితే బట్టీపడితే మార్కులు వస్తాయి కానీ విశ్లేషణ రాదు." అంతా "అలాగే టీచర్ "అన్నారు.
కామెంట్‌లు