కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సాయంత్రం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అందంగా అలంకరించుకొని చక్కగా నృత్యం చేశారు. పాఠశాలలో పిల్లలు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు కృష్ణాష్టమి వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు. కృష్ణాష్టమి ప్రాముఖ్యతను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయునిలు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి వివరించగా, పిల్లలు ఆసక్తితో విన్నారు. రేపు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా పాఠశాలకు సెలవు దినం అయినందున ముందస్తుగా పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి