కవి, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ పిల్లి హజరత్తయ్య గారికి సత్కారం

 శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ సాంస్కృతిక, సాహిత్య సేవా సంస్థ మరియు డా. బోయి భీమన్న సాహిత్య నిధి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో "కృష్ణానది తీరాన కవిత్వం" పేరిట నిర్వహించిన జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో పాల్గోని కవితా గానం చేసినందుకు శ్రీ పిల్లి హజరత్తయ్య గారిని ఘనంగా సన్మానించారు. శ్రీ శ్రీ కళావేదిక కృష్ణా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో తేది 28/8/22న జరిగిన కవి సమ్మేళనంలో "నాడు-నేడు" అనే కవితను ఆలపించినందుకు మరియు వారి సాహితీ సేవలను గుర్తించి మెమొంటో, ప్రశంసాపత్రం, మరియు శాలువతో సంప్రదాయబద్దంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి పిల్లంగోళ్ళ. శ్రీ లక్ష్మి గారు, శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్, సాహిత్య భూషణ్ డా. కత్తిమండ ప్రతాప్ గారు శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ కన్వీనర్ కె. రమాపతి గారు శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ,రాష్ట్ర,జిల్లా కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. ఉభయరాష్ట్రాల నుండి సుమారుగా 200 మంది కవులు ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి హజరత్తయ్య గారిని తోటి కవులు, ఉపాధ్యాయులు, స్నేహితులు అభినందించారు.
కామెంట్‌లు