కృష్ణా; -సాహితీసింధు సరళగున్నాల
రాధామాధవకృష్ణా
మోదాకృతినందినావె మోహనకృష్ణా
యేదరి జేరకనిల్చిన
మాదరినీవుందువయ్య మాయిలవేల్పై

ఒక్కరుగానినువేడిన
దక్కునుగాసంతసమ్ము, తాదాత్మ్యమ్మున్
జిక్కిన సంతసమౌగద
చొక్కెడియీదేహమునకు సుఖములునేలన్

కామెంట్‌లు