సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
   కక్ష... వివక్ష...
  *****
 కక్ష ,వివక్ష... ఇవి రెండూ  మనిషికి ఉండకూడని లక్షణాలు.
కానీ కొంతమంది తమ ప్రగతికి అడ్డు వస్తున్నారని, తనను మించి బాగుపడుతున్నారని, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా  అభివృద్ధికి ఓర్వలేక  వాళ్ళపై పెంచుకున్న అసూయ ఈర్ష్యా భావమే కక్ష.
ఇది చాలా ప్రమాదకరమైనది.మనిషిని  నిలువునా విషంతో నింపుతుంది.
ఇక వివక్ష... ఇదో తరహా  కక్ష . బంతిలో వలపక్షం అంటుంటారు.
తమకు నచ్చిన వాళ్ళను  ఓ రకంగా నచ్చని వాళ్ళను మరో రకంగా చూడటం.  ఇంట్లో కూడా ఇలాంటి వివక్షతలు ఉంటాయి.
ఆడపిల్లలు,మొగ పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చూపే తేడా,సమాజ పరంగా కుల మత వర్గ వర్ణ వివక్ష చూపడం చూస్తూ ఉంటాం.
 కక్ష సాధింపు,వివక్షతో చూడటం రెండూ మనిషికీ మనుగడకూ సమాజానికి హానికరమైనవే.
మనిషిని మనిషిగా చూడటం, సాటి వారి పట్ల సమానత్వంతో మెలగడం అనేది ముఖ్యమని ప్రతి వారూ గ్రహించాలి.
అశాశ్వతమైన జీవితంలో కక్షలు వివక్షలు ఎందుకని ఒక్కసారి ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.పువ్వులా బతకడం నేర్చుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు