భారమాయె బ్రతుకు పండింప పంటలన్
నమ్మబోవ ధరలు నడగునంటె
కొనగనేదియైన కొండంత పెంపుయే
రైతుజీవితమ్ము రగులుచుండె
విత్తనాలు కొనిన చెత్తనధికమాయె
విత్తుకున్నమొలక లెత్తుకెదిగి
గింజబట్టకున్న కెరలుదుఃఖముతోడ
చెట్టు కొమ్మజేరె తట్టుకొనక
పంటలన్నిబెట్టి పండింప ధాన్యమ్ము
వర్షధారచెలగి పంటమునుగ
బిక్కమొగమువేసి బక్కచిక్కెనురైతు
వారిబాధగాంచ పలుకులుడిగె
చేలుదుక్కిదున్ని చెమటనుచిందించి
విత్తువిత్తుకొనును వేడ్కతోడ
మొలకలెత్తచినుకు మొగముదాచినవేళ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి