ఒకరు కులంపేర...
మరొకరు మతం పేర...
వేరొకరు వర్గంపేర...
అందరూ విద్వేషాలను
రెచ్చగొట్టేవారే.... !
శతృత్వాలను పెంచేవారే !!
అశాంతిని రగిలుంచేవారే!!!
మారణహోమాలుసాగించేవారే
నేనెవర్నని నిందించను... !
ప్రేరేపిస్తున్న పరిస్థితులనుతప్ప
అందరికీ తెలుసు, వారి - వారి
వాదనల్లో నిజంలేదని,అది న్యా యసమ్మతం కాదని !
తప్పుతమదేఐనా.....ఎదుటి
వారిపై నెట్టేసే మనిషి నైజమే అంత... !
పనిగట్టుకుని,పనికిమాలిన
మాటలాడనిదే...వాళ్లనోటి తీట
తీరదు !
మరిచిపోతున్న చేదు గతాన్ని
తవ్వుతూ...ఆహ్లాదభరితమైన
వర్తమానాన్ని అల్లకల్లోలం చేసే స్తారు...!భవిష్యత్తునుఅయోమ యంలోకి తోసేస్తారు... !!
కాలంమారుతోంది,చరిత్రచేసిన గాయాలన్నీమాని,మచ్చగడు తున్నై.. ! వాటిని పుల్లవిరుపు మాటలతో కెలికి కోతిపుండు బ్రహ్మ రాక్షసిలా ఎందుకుతయా
రు చేస్తారు !?లేని సమస్యల నెందుకు సృష్టించటం ?!ఉన్న సమస్యలు చాలవనా.. ?!
అలా ఐతేగానీ... మీ పైశాచి కాత్మలు శాంతించవా !?
మీరాక్షసానందంతృప్తిచెందదా
ఎవరిబ్రతుకులు వారు... స్నేహ సుహృద్భావాలతో హాయిగా బ్రతుకుతున్నారు...ఈ జనాన్ని లా బ్రతకనివ్వండి... !
విద్వేషాలనుసృష్టించి బద్దశత్రు
వులుగా మార్చకండి !! మీ మీ ఇజాలను అవసరంలేని ప్రజల
నెత్తిన రుద్ది వాళ్ళను పిచ్చి వా ళ్లను చెయ్యకండి ఆ పిచ్చికాస్తా ముదిరి...మిమ్మల్నే కరిచే పరిస్థి తులు తీసుకురాకండి... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి