మన తెలుగు ; -బృంద
అచ్చమైన తెలుగు
అందమైన తెలుగు
అమ్మలాటి తెలుగు
అదృష్టం  తెలుగు.

అమ్మ భాషను ఆదరించమని
అర్థించాల్సిన అవసరం.

చిన్న పదాల వాడుక కూడా
మరచి ప్రాచ్యబాష ప్రయోగం

ప్రాచీనమైన తెలుగు
కాలప్రవాహంలో మార్పులు
సంతరించుకున్నా....
మూలాలు మరువకూడదు.

తెలుగు సరిగా  వ్రాయడం
రాని తరాలు తయారయాయి.

తెలుగును ఆంగ్లీకరించి
కర్ణకఠోరమైన ప్రయోగాలు

సామాజిక మాధ్యమాల్లొ
తెలుగువారు తప్పక
తెలుగే వాడాలని విన్నపం.

మార్పు మన నుండీ
మొదలవాలి.
మన తరువాతి వారికి
మన తెలుగు సొగసు
తెలియచెప్పి
 అలవాటుచేయాలి

మనకే సొంతమైన 
సాహితీ ప్రయోగాలను
ఆదరించాలి.

చిన్న చిన్న పోటీలతో
ప్రోత్సహించాలి

ఈ తరానికి అర్ధమయే
విషయవస్తువు  తీసుకుని
బుర్రకథలు.హరికథలు
మొదలైనవి తయారుచేసి
ప్రచారం చేయాలి.

తెలుగు మాటాడని
తెలుగువారి కాపురాలు
తేట తెలుగు మెరుపులతో
పరిమళించాలి.

నిమిషంపాటు తెలుగు
పదాలు మాత్రమేనని  వాడే ఆటలు
బడిలో మొదలుపెట్టాలి.

సరిఅయిన సమయంలో
దోషాలు లేని సరళమైన
తెలుగు పలకడం నేర్పాల్సిన
భాధ్యత తలిదండ్రులే
తీసుకోవాలి.
ఆ క్రమంలో వాళ్ళూ
తమను సరిదిద్దుకోవాలి.

ఆస్తులూ సౌకర్యాలతోపాటు
మన భాషా సంపదకూడా
వారసత్వంగా అందించాలి.

పదాల అర్థాలు తెలియచేసి
పలికేలా చేయాలి.

భాగవత పద్యాలపోటీలు
పెట్టి ఉచ్ఛారణ మెరుగుపరచాలి.

వారానికి ఒకసారైనా
అందుబాటులో పిల్లలని
సమీకరించి సంస్కరించాలి.

కనీసం ఒకరికి తెలుగు నేర్పి
ప్రోత్సహించడం కర్తవ్యంలా
భావించాలి.
ఇది ఒక ఉద్యమంగా
ప్రతిఒక్కరూ తీసుకోవాలి.

ఇది ఎవరికి వారు 
తెచ్చుకోవలసిన మార్పు

మన అమ్మను మనమే
చూసుకోవాలి
మన భాషను మనమే
బ్రతికించుకోవాలి.


కామెంట్‌లు