చిత్ర పద్యం -ప్రభుత్వ బడి ;-ఎం. వి. ఉమాదేవి
ఆట వెలది 

అన్న చెల్లి గలిసి యానంద మొలికించ
బడికివెడలి యచట పలుకుచదువు 
బాల్య జ్ఞాపకములు బహుచక్క గానుండు 
నాతికైన మహిని నరునికైన!

గురువుగారు జెప్పు గురుతైన పాఠముల్ 
వల్లె వేసి పిదప వ్రాసి జూపి 
బుద్ధి పెంచుకొనుచు బువ్వలన్ దినివచ్చు 
ప్రభుత నడుపుచుండు బడులనిట్లు !!

కామెంట్‌లు