సుప్రభాత కవిత ; -బృంద
ఆశను అడుగంటనివ్వదు
ఆరాటం ఆవిరవనివ్వదు

వేదనలెన్ని వేధించినా
వాడుకగా  వాటిని మారనివ్వదు.

గుండె గదుల గోడలపై
అనుభూతుల అక్షరాలు చెదరనివ్వదు.

కనిపించని తేనెతుట్టెను
కదిలించి  మనసును బెదరనివ్వదు

మమకారాలకు ఆకారం
ఇవ్వకపోయినా వసి వాడనివ్వదు.

ఒడిదుడుకుల  ప్రయాణంలో
కష్టాలకు వెరవనివ్వదు.

కంటి నిండుగ కన్న కలలను
కల్లలు గా  మారనివ్వదు.

అందమైన బంధాలను
అందుకునే దూరాలు పెరగనివ్వదు.

కొంగుజాపి కోరిన కోర్కెలు
తీరకుండా కొడిగట్టనివ్వదు.

గగనంలో కాగడాలా వెలిగేదీపం
చీకటినెప్పుడూ గెలవనివ్వదు


రేపులోని తీపి చెమ్మను
తేరనివ్వదు .....ఆరనివ్వదు

మనసు నింపు ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు