నానీలు :కోరాడనరసింహా రావు

 సప్తస్వరముల 
 మెస్మరిజం... !
  మనసు వశమయ్యే 
    దివ్యమంత్ర0 సంగీతం !!
     *****
 స్వరారోహణ 
  అవరోహణ 
    గమకాలాపన....
     ఓలలాడించే విన్యాసాలు.
     ******
సుస్వరసంగీత నాదం 
    రోగాలుమాయం 
      అద్భుత వైద్యం 
         చక్కని ఆరోగ్యం !
    ******
వర్షం కురుస్తుంది 
  రాళ్లు కరుగుతై 
   పాములచేతా 
     తలలూపించే సంగీతం
     ****** 
స్వరములు ఏడే... 
  రాగాలు వేనవేలు !
    గాత్రంలోనేకాదు 
      జంత్ర వాద్యంలోనూ !!
.    *******
గీత,నాట్యాలకు 
  అందాన్నిచ్చి... 
    ఆకర్షణ పెంచిoది 
      సంగీత సహకారo !
       *****
కామెంట్‌లు