తల్లిమాటవినిన తరగని ధనమౌచు
దారిజూపుచుండు ధరణియందు
పెద్దలాడుమాట పెడచెవిబెట్టిన
కుంటుపడును ప్రగతి గూడుచెదురు
తరిగిపోనియట్టి ధనము జననిప్రేమ
పొందుచున్నవాడు భూయశస్వి
తల్లిలేనిబ్రతుకు కల్లోలమునురేపు
సంతసమ్ముగూలు శాంతివోవు
తానుతినకయున్న తనయుల పొట్టను
నింపిజూచిమురియు ,నీడలాగ
గాచు తల్లి కన్న ఘనమైనదేదిరా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి