సుప్రభాత కవిత ; -బృంద
వెన్నెల్లో తడిసి ముద్దైన
మురిపాల మైమరపు

నులివెచ్చని కిరణాల
తాకిడికి మగతగా కళ్ళు
విప్పి చూసేవేళ....

మమతలు నిండిన
మనసున
చెలిమి చూపిన ఆత్మీయత

గురుతుకొచ్చి
విరిసిన ఇసుకతిన్నెల
పెదవుల  నవ్వులు.

మురిపెంగా  చూస్తూ
మొద్దునిద్దరేవిటంటూ
ముద్దుగా విసుక్కుంటూ

తలనిమిరి.....
మేలుకొలుపుతున్న
మిత్రుని ఆగమనం....

జగతికి శుభదాయకం
మనసుకు ఉత్సాహం 

🌸🌸 సుప్రభాతం 🌸🌸



కామెంట్‌లు