సుప్రభాత కవిత ; -బృంద
ప్రతిధ్వనించే నిశ్శబ్దం 
పలుకరించే పరిమళం

మూగబోయిన మానసం
పల్లవించిన మౌనం

నాట్యమాడు  తరువులు 
నవ్వులు విరిసే పువ్వులు

మనసుదోచు రమణీయ దృశ్యం 
మదిని నింపె అనుభూతుల కావ్యం

కమ్ముకుంటున్న వెలుగుల్లో
రంగులు పులుముకున్న మబ్బులు

రెక్కల రెప్పలు తెరిచి విరిసి
నేలరాలిన చుక్కల్లా మెరిసి

పుడమి చెక్కిలిని పసుపురాసి
చేయించిన వేకువ వెలుగుల స్నానం

మురిపించే అందాలు
మనసు దోచే మౌనాలు

ఇచ్చే చక్కటి అనుభూతిని
మనసారా  ఆస్వాదిస్తూ

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు