చిత్రకవిత :- @నీఇష్టం @కోరాడ నరసింహా రావు !
మనిషి తన అవసరాలకు సృష్టించిన డబ్బు.... !
ఆ మనిషి నోరుమూయించి... 
మీదనెక్కి స్వారీ చేస్తోంది !!

ధనమూలమిదం జగత్... !
ప్రాణాలు పోసేదీ.. తీసేది  ఈ డబ్బే.... !!

ఇది మంచిని పెంచగలదు... 
  మానవతను త్రుంచనూ     
.           గలదు !

ఎంత కాదనుకున్నా ఈ నోటు మూతి కట్టై... ఔనని తల లూ పించగలదు  !

ఇది రెండువైపులా పదునున్న ఖడ్గం... !

దీనితో... కాయగూరలూ,   పళ్ళూ తరుగుకుంటావో... 
 అన్యాయాక్రమాల కుత్తుకలు కొస్తావో...., నీపీకే  నువ్ కోసు కుంటావో.... నీ ఇష్టం... !
      ******

కామెంట్‌లు