: ప్రకృతి సోయగాలు;-జక్కల శివ, ఇంటర్ మీడియట్ , నల్లగొండ


 *********
 తేటగీతి 
 రంగురంగుల పుష్పాలు రమ్యముగను
 యేపుగ పెరుగుచున్నవి యె దను దోచి 
 పకృతి సొగసుల స్తుతి చేయ శక్య మగునె  
 పరవశించెను హృదయము   పకృతి కాంచి 
సమస్య పురాణం : నిద్రపోవువారు నీచులయ్య
-------------------------------------------------------
ఆట వెలది 
 పనులు చేయుటొదిలి బద్దకించెడి వారు
 కార్యసిద్ధి కొరకు కష్టపడక 
 కళ్ళు మూసి పగటి కలలను  కనుచుండి 
 నిద్రపోవు వారు నీచులయ్య
*********

కామెంట్‌లు