అక్షర దీపాలను వెలిగిస్తా
అఙ్ఞాన అంధకారాన్ని తరిమేస్తా
తేనెలూరు పదాలను పేరుస్తా
అద్భుత అర్ధాలను తెలియజేస్తా
ప్రాసలను సొంపుగా వాడేస్తా
చెవులకు ఇంపును కలిగిస్తా
పాటలను తీపిగా పాడేస్తా
మనసులను ముచ్చట పరిచేస్తా
కవితలను నదిలా పారిస్తా
పద్యాలను అందంగా అల్లేస్తా
గేయాలను గమ్మత్తుగా వ్రాసేస్తా
సాహిత్య పంటలను పండిస్తా
ఆలోచనలను మదిలో పుట్టిస్తా
తిన్నగా కవ్వంతో చిలికేస్తా
భావాలను వెన్నలా తేలాడిస్తా
చదువరులకు చక్కగా అందిస్తా
ప్రకృతి అందాలను వర్ణిస్తా
పాఠకులకు ఆనందాలను పంచేస్తా
మనసులను ముచ్చట పరుస్తా
సాహితీలోకాన శాశ్వతంగా నిలిచిపోతా
సరస్వతిని స్వాగతిస్తా
సాహిత్యాన్ని సృష్టిస్తా
కవనం కొనసాగిస్తా
కవితలను కనేస్తా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి