విఘ్నేశ్వరుని
వేడుకొని
కలాన్ని పట్టా
కానీ కదలలా
అంజనేయుని
అర్ధించా
అ ఆలు
అందుబాటులోకి రాలా
మురళీకృష్ణునికి
మొక్కా
మనసు కలమును
ముందుకు నడపలా
సాయిబాబాను
శ్లాఘించా
చేతిలోనికలం
సాగలా
అయ్యప్పకు
శరణంచెప్పా
అక్షరాలు
స్ఫురించలా
వెంకటేశ్వరునికి
విన్నవించుకున్నా
విషయాలేమి
ఉరకలా
శివుని
ధ్యానించా
సాహితి
కరుణించలా
విరించికి
విన్నపంచేసుకున్నా
ప్రయోజనం
కనిపించలా
పార్వతిదేవిని
ప్రార్ధించా
పదాలు
పారలా
లక్ష్మిదేవిని
తలచుకున్నా
లక్ష్యం
సిద్ధించలా
అప్పుడు
అర్ధమయ్యింది
బుద్ధొచ్చింది
ఊహతట్టింది
వాగ్దేవిని
వేడుకున్నా
వెంటనే
వెలుగొచ్చింది
అంధకారం
అంతమయ్యింది
భావాలు
బయటకొచ్చాయి
ఆలోచనలు
అంతరంగాన్నిముట్టాయి
అక్షరదీపాలు
ఆవరించాయి
పదాలు
పొంగిపొర్లాయి
విషయాలు
వెంటబడ్డాయి
కలం
దౌడుతీసింది
కాగితాలు
నిండిపోయాయి
కవితలజల్లు
కురిసింది
సాహితీవరద
సాగింది
పద్యాలు
పుట్టకొచ్చాయి
పాటలు
పరుగులెత్తాయి
వాగ్దేవికి
వేలవేల వందనాలు
సాహితికి
స్వాగత సుస్వాగతాలు
ఙ్ఞానోదయం
అయ్యింది
సరస్వతీకటాక్షం
దొరికింది
కవితలను
పారిస్తా
కమ్మదనాన్ని
అందిస్తా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి