శాంతించవమ్మా ఓ జగద్జననీ ; కోరాడ నరసింహా రావు !
ఆదియందు కాలరాత్రివి... !
ఓం కార ధ్వని సహిత... 
 దివ్యకాంతి రూపుదాల్చావు!!
 సృష్ఠి, స్థితి, లయ కర్తలకే జన్మ నిచ్చావు... నీవు జన్మనిచ్చావు 

ఆదిశక్తివి మూడుమూర్తుల... 
 అవతరించావు,ఆ ముగ్గురకూ  శక్తుల కట్టబెట్టావు !

అష్ట దిక్కులు, నవగ్రహముల నేర్పరిచావు, పంచభూతముల 
ప్రకృతిగ మారిపోయావు,నీవు 
మారిపోయావు !

కుచద్వయమున నిండుగా... 
జ్ఞానమారోగ్యముల నింపి... 
 పోషించేవు, తల్లీ పాలించేవు !

అమ్మవై, అక్కవై, చెల్లివై,ఆలివై
కన్నబిడ్డగ వచ్చినీవు,అలరింప జేసేవు, నీ వలరింప జేసేవు !
  జగతిన ప్రాణికోటి పరవశంతో పులకరిస్తుంది,తల్లీపులకరిస్తుం ది  !!

శిష్టులనురక్షించగా...దుష్టులను
దునుమాడ నీవు, అష్టభుజివై భీకరాకృతితో,సింహవాహినివై 
బయలుదేరితివా,తల్లీ బయలు దేరితివా... !!

ఓ భద్రకాళీ...కాళరాత్రీ.... !
ఛండివి, చాముండివి... ఆ ముగ్గురయ్యాలకూ అమ్మవూ 
ఆలివీ నీవే..., శాంతించి, ప్రస న్న రూపముతో... మ మ్మను గ్రహింపుమా....! ఓ జగద్జననీ 
అనుగ్ర హింపుమా....!!
వినతులివి, మా ప్రణతులివి 
గైకొని దీవించుమా, మమ్ము దీవించుమా... అమ్మా దీవించుమా... !
      *******

కామెంట్‌లు