బాల పంచపది
============
చెల్లీ నేను ఒకటే జట్టు
కాదనలేను మీపై ఒట్టు
ఏమి తిన్నా చెల్లికి పెట్టు
ఇద్దరు కల్సి నాటే చెట్టు
చెల్లికుంది రింగులజుట్టు ఉమ!
బడికిపోయే మంచి తోడు
గుడికి రోజూ వచ్చు చూడు
నన్ను చూస్తే దోస్తుల వీడు
స్కిప్పింగ్ లోను ఇచ్చే తాడు
ఇద్దరుకట్టే ఇసకలోగూడు ఉమ !
మా చెల్లాయి కాస్త మొండి
ఐనా లోపల ప్రేమ ఉండి
చెప్పే మంచి సంగతులండి
కోపంవస్తే తానో చండి
చెల్లితో ఆటకి పోతానండి ఉమ!
దోస్తుల్లాగ కలిసుంటాము
చెల్లీ నేను బాగుంటాము
కథలెన్నొ మరి మేమింటాము
బామ్మపక్కన పడుకుంటాము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి