నీకు నీవే తోడు
నీకు నీవే ధైర్యం
నీ చూపులు నీ ఆలోచనలను
అనుసరించి
నీ ఆలోచనలు నీ బుద్ధిననుసరించి
నీ బుద్ధి ....నీ విచక్షణననుసరించి
నీ విచక్షణ...నీ సంస్కారాన్ననుసరించి
నీ సంస్కారం... నీ ప్రవర్తనన నుసరించి
నీ ప్రవర్తన.....నీ ధర్మాన్నసరించి
ఒంటరిగా......ఉన్నా
సమూహంలో ఉన్నా
ఒక్కతీరుగా వుండే భావనలు.
నొప్పింపక ..తానొవ్వక
అందరూ ఒప్పుకునేలా
ఉండడమే ధర్మం
అన్నిటినీ సమతౌల్యం
చేసుకుంటూ.....
ఊగిసలాడే సమయంలో కూడా
తడబడకుండా....
రేపు మాపులు దాటుకుంటూ
జీవితనౌక సాగించడమే
మానవ ధర్మం.
మనకెపుడూ తోడుండే
కర్మసాక్షికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి