బొమ్మలబండీ వచ్చింది
బొమ్మలు ఎన్నో తెచ్చింది
రంగుల బొమ్మలు ఉన్నాయి
నాకు అన్నీ నచ్చాయి
పశువులు పక్షులు
మనుషులు కోతులు
ఉడుత కుందేలు
ఏనుగు గుర్రం
ఆవు ఎద్దు
సింహం నక్క
ఎన్నోజీవులు ఉన్నాయి
పనస అరటి
ఆపిలు అనాస
మామిడి సపోట
జామ సీతాఫలము
ఎన్నోఫలాలు ఉన్నాయి
బూర పీక
డప్పు కంజీర
కుర్చీ టేబుల్
వంటపాత్రలు
ఎన్నో బొమ్మలు ఉన్నాయి
అన్నీ మనను పిలుస్తున్నాయి
అన్నీ మనమే కొందాము
ఆనందంగా ఆడుకుందాము !!
బొమ్మలబండి ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి