పాప నవ్వింది ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
మాపాప నవ్విందంటే 
మా ఇంట పండుగలే
మాపాప నవ్విందంటే
మాకంట పున్నములే
!!మాపాప!!
పాప మోము నిండు చంద్రుడూ 
పాప కన్నుల్లో పండు వెన్నెలా
పాప బుగ్గ గులాబి మొగ్గ 
పాప పదవులు దొండపండులూ
!!మాపాప!!
పాప మనసూ వెన్నకన్న మెత్తగా 
పాప మమతా కన్నమిన్న లేదుగా 

నందం అంటే పాపేగా
ఆత్మీయత అంటే పాపేగా 
!!మాపాప!!
శాంతీసహనం పాప చిరుగాలీ
ఆనందం ఆరోగ్యం పాపమ్రోల వాలాలీ 
పాపదారి పూలదారి కావాలీ 
పాపే మా ప్రాణమంటే నమ్మాలీ
!!మాపాప!!

కామెంట్‌లు