పూబాల ....!!--మాటలు ...ఆన్షి >రాతలు ...తాతవి .----డా.కె.ఎల్వి.

 పూవును నేను
పువ్వునునేను
కుసమం నేను
అందమైన-
పువ్వునునేను...!
రంగురంగులతో 
రకరకాలుగా ....
కనిపిస్తుంటాను 
అందరినీ -
యెంతగానో ....
ఆకర్షిస్తుంటాను !
సువాసనలున్నా 
సుగంధం రాకున్నా 
మాతృమూర్తుల సిగలో 
సింగారింప బడతాను!
దేవుడిపాదాలచెంత 
దీవెనులందుతాను!
పూలదండలో.....
ఒకభాగమై----
పలువురి ఆనందంతో
పాలు పంచుకుంటాను !
పువ్వును నేను ....
అందమైన పువ్వునునేను!!

కామెంట్‌లు