అది ఒక చిన్న ఇసుక రేణువు
కానీ సహారా ఎడారి అదీ!!
అలాగే ఉంది
అలాగే ఎదిగింది ఆమె!!?
అది ఒక చిన్న కిరణం
కానీ ఒక పెద్ద వెలుగు అదీ!!
అలాగే ఉంది
అలాగే ఎదిగింది ఆమె!!?
అది ఒక చిన్న నది
కానీ ఒక హిందూ మహాసముద్రం అదీ!!
అలాగే ఉంది
అలాగే ఎదిగింది ఆమె!!?
అది ఒక చిన్న మొక్క
కానీ అది ఒక మహారణ్యం!!?
అలాగే ఉంది
అలాగే ఎదిగింది ఆమె!!?
అది ఒక సీదా సాదా దూది
కానీ అది రాట్నంపై ఒడికిన
నూలు పోగై కోట్ల భారతీయుల
మానాల్ని కాపాడిన బాహుటా అదీ!!
అలాగే ఉంది
అలాగే ఎదిగింది ఆమె!!?
అది ఒక సగం నెలవంక
కానీ కోట్ల నక్షత్రాల ఆకాశము అదీ!!
అలాగే ఉంది
అలాగే ఎదిగింది ఆమె!!?
అది జననీ జన్మభూమి
కానీ కోట్ల జనులకు
జన్మనిచ్చిన భరతమాత
అలాగే ఉంది
అలాగే ఎదిగింది ఆమె!!?
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి