సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 వగపు.... వెరుపు
  ******
బాధ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కలిగే మనస్తాపాన్నే  వగపు అంటారు.
కొందరు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. వాళ్ళు ఏదైనా సంఘటన జరిగినప్పుడు, అనుకోని విషాద పరిస్థితి ఎదురైనప్పుడు తీవ్రమైన అలజడికి లోనవుతూ  అంతులేని మనోవ్యధ పడుతుంటారు.

కొందరు  ప్రతి చిన్న విషయానికి, ప్రతివారికీ భయపడుతూ ఉంటారు. 
ఏది మాట్లాడితే ఏం తప్పో, ఏం చేస్తే ఏమనుకుంటారో అనే విపరీతమైన భయం వారిని వెంటాడుతూ ఉంటుంది.
ఇలాంటి వెరుపు వల్లనే వాళ్ళు ఏదీ సాధించలేక పోతుంటారు. 
వెరపును మించిన బలహీనత ఇంకొకటి లేదు. వగపును మించిన నిస్సహాయ స్థితి మరొకటి లేదు.
ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు వాళ్ళపై  పెత్తనం చేస్తుండటం మనం చూస్తుంటాం.
వగపు,వెరుపు రెండూ వ్యక్తి ముందటి కాళ్ళకు బంధాలు. అడుగు ముందుకు సాగనీయని అవరోధాలు.
అందుకే దేనికి అతిగా వగచవద్దు, ఎవరికీ వెరవొద్దు. ఈ బలహీనతలను అధిగమించి ముందుకు సాగుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు