:పదండిముందుకు;-సాహితీసింధు సరళగున్నాల
ఎవరునెన్నిజెప్ప యెదురులేదనిముందు
కేగుచున్నమేలు నిలనుగలదు
విద్యనేర్చుకున్న విలువైన బ్రతుకును 
పొందగలరు బాల పోరులేక

కష్టనష్టములవి క్రమ్మినన్ వెనుకకు 
తగ్గబోక, ముందు నెగ్గుబలుక
చనిన మేలుగలుగు జగతిన విజయమ్ము
చేరు సుఖము నిలుచు చిందువెలుగు

అలుపు సొలుపు యనుచు నానందమందగ
కష్టబడక ,సుఖము నందువారు
ముందుకేగలేక మోసపోదురుగదా
తెలిసి కొనుచు నడవ ధీయుతుండు

కామెంట్‌లు