రుబాయీలు --ఎం. వి. ఉమాదేవి బాసర
పలకరింపు చిత్రంగా ప్రాణoలో నిలుస్తుంది 
ఊరడింపు మాటేదో ఊపిరిలో నిలుస్తుంది 
మనసుపంచు మైత్రికొరకు 
హృదయమిదే కలవరింత 
తెలియలేని మాధుర్యం 
స్నేహములో నిలుస్తుంది !!

సంపదలు కావాలని వేడుకో  మంచిదే 
గుంపులో బతకాలని కోరుకో మంచిదే 
పదిమంది మెచ్చేది పరిణితిని ఇస్తుంది 
సంయమన శిఖరాలు చేరుకో మంచిదే !!

నీచూపు జడివాన తడిపేస్తు ఉన్నాది 
నీమాట లోకైపు ముంచేస్తు ఉన్నాది 
ప్రణయాన ప్రతిపొద్దు అద్భుతమే అవుతుంటె 
తులలేని రాగాల తడిమేస్తు ఉన్నాది !!

తేనెటీగ ప్రయత్నమే తెలుసుకొనుట ఆశ్చర్యం 
చిన్ని చీమ పెద్దబరువు మోసుకొనుట ఆశ్చర్యం 
సృష్టిలోని ప్రతిజీవి మనగలిగే దైవకృపలు 
ఎరుకలేని మనిషిధనం పెంచుకొనుట ఆశ్చర్యం !

కామెంట్‌లు