మనం గణపతిని పూజిద్దాం
.. రండి బాలలూ.... !
తెలివితేటలనిమ్మందాం...
పదండి బాలలూ... !!
అమ్మకు గారాల పట్టి...
ఈ బొజ్జ గణపతి !
కర్తవ్యనిష్ఠలో... ఇతనికి
ఇతనే సాటి... !!
సమర్థులెవరో తెలిసికొనగ
జరిగెను పోటీ... !
ఇతడు యుక్తితో తమ్ముడిని
గెలిచిన మేటి.. !!
అయ్య ఆగ్రహించగా....
అమ్మ అనుగ్రహంతో....
ఆదిపూజలందుతున్న....
ఘనుడే యితడు... !
మనం గణపతిని పూజిద్దాం
రండి బాలలూ... !
తెలివితేటలనడిగేద్దాం....
పదండి బాలలూ... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి