సుప్రభాత కవిత ; బృంద
సాగే గమనం
ఆగని పయనం...

వెలుగును చూసి
పెరిగే వేగం....

ఉరికే ఉత్సాహం 
ఉరిమే ఉత్తేజం

మౌనమే బలం
మనసు నిర్మలం

వడివడిగ నడిచే
అడుగుల ఆరాటం.

ఊహలు తోడు
ఊపిరి జోడు

చూపు గమ్యం వైపు
నడక విజయం వైపు

కళ్ళలో  కలలు
కనుచూపులో  గమ్యం

వెలుగుల ఉదయం
గెలిచిన సహనం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు