ముఖం మనదే అయినప్పటికీ చూసినవారు ముఖాన్ని తమ మాటల్లో చెప్పినప్పటికీ ఆ ముఖాన్ని చూసుకోవాలనుకుంటే అందుకు కావలసినది అద్దమే. అటువంటి అద్దానికున్న చరిత్ర సుదీర్ఘమైనది. కోపం వచ్చినప్పుడు ఒక్కసారి అద్దంలోకి చూసుకుంటే మనమీద మనకే వెగటు పుడుతుంది. నవ్వెంత అందాన్నిస్తుందో కోపం రెట్టింపు వికారాన్ని తెచ్చిపెడుతుంది ముఖానికి!
రోమన్ రచయిత ప్లినీ ది ఎల్డర్ మొదటిసారిగా గాజు అద్దాల ఉపయోగం గురించి ప్రస్తావించాడు.
క్రీ.పూ. 4000 నుండి 3000 వరకు మెసొపొటేమియా (ఇప్పుడు ఇరాక్), ఈజిప్టులో పాలిష్ చేసిన రాగితో తయారు చేయసిన అద్దాలు వాడుకలోకి వచ్చాయి. ఆ తర్వాత సుమారు 1,000 సంవత్సరాలకు మధ్య, దక్షిణ అమెరికాలో పాలిష్ చేసిన రాయితో అద్దాలను తయారుచేయడం ప్రారంభించారు. క్రమంగా మిగిలిన దేశాలలోనూ అద్దాలు మొదలయ్యాయి.
1835లో, జర్మన్ రసాయన శాస్త్రవేత్త జస్టస్ వాన్ లీబిగ్ justus von liebig స్పష్టమైన గాజు పేన్‌కు ఒక వైపున లోహపు వెండి పలుచని పొరను వర్తించే ప్రక్రియను అభివృద్ధి చేశారు.
1970లలో పపువా న్యూగినియాలోని ఓ శాస్త్రవేత్త అద్దాలను పరిచయం చేసినప్పుడు, అక్కడి వారు భయాందోళనలు చెందారు.
అవన్నీ అలా ఉంటే టర్కీకి చెందిన బెర్క్ ఇల్హాన్ Berk Ilhan ఓ కొత్తరకం అద్దాన్ని రూపొందించాడు. దానికి స్మయిల్ మిర్రర్ Smile Mirror అని నామకరణం చేశాడు.
ఇది క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా చేసిన అద్దం. ఓ టాబ్ (Tab) రూపంలో
ఉండే ఈ అద్దానికో కెమెరా అమర్చాడు. ముఖ వీక్షకుల ముఖ భావోద్వేగాలను ఈ కెమేరా చూపిస్తుంది.
ఈ అద్దం చూసి నవ్వితేనే అద్దంలో మన ముఖం కనిపిస్తుంది. నవ్వకపోతే అద్దంలో ముఖం కనిపించదు. ఈ అద్దం ధర నాలుగేళ్ళ క్రితం లక్ష రూపాయలపైనేసుమీ!
బెర్గ్ ఇల్హాన్ ఈ అద్దం తయారుచేయడానికో కారణముంది.
అతని కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ వచ్చింది. దాంతో తన సంతోషాన్నీ, నవ్వునీ పోగొట్టుకుని అద్దంలో చూసుకోవడం మానేశాడు. అప్పుడు అతనిని సంతోషపెట్టడానికి ఏదైనా చేయాలనుకున్న ఇల్హాన్ ఆలోచనలోంచే ఈ కొత్త అద్దం పుట్టుకొచ్చింది.
న్యూయార్క్‌లో చదువు పూర్తయిన తర్వాత కొన్ని క్యాన్సర్ ఆసుపత్రులను సందర్శించిన ఇల్హాన్ పరిశోధనలు చేశాడు. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తితోపాటు ఆయుష్షు పెరుగుతుందని తెలుసుకున్నాడతను. ఆ తర్వాత క్యాన్సర్ రోగులతోనూ, డాక్టర్లతోనూ మాట్లాడాడు. అనంతరంఓ రెండు సంవత్సరాలు శ్రమించి నవ్వినప్పుడు ముఖం కనిపించే ఈ అద్దాన్ని తయారు చేసాడు. ఈ అద్దం తయారీకి చాలానే ఖర్చవుతుంది. అతని సృష్టిని గుర్తించి న్యూయార్కులో ఘనంగా సత్కరించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి