ప్రభావతి.పురాణ బేతాళ కథ.; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు ప్రభావతి గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా ప్రభావతి మహాభారతంలోని పురాణ పాత్ర. వజ్రనాభుడు అనే రాక్షసుని కూమార్తె. శ్రీకృష్ణడి కుమారుడైన ప్రద్యుమ్నుని భార్య.
మేరుపర్వతం దగ్గర వజ్రపురి అనే అద్భుతమైన నగరాన్ని వజ్రనాభుడు అనే రాక్షసుడు పాలిస్తుండేవాడు. వజ్రనాభుడి అనుమతి లేకుండా ఎవరూ కూడా ఆ నగరంలోకి ప్రవేశించటానికి వీల్లేదు. వజ్రనాభుడి కుమార్తె ప్రభావతి. ఒకనాడు కలలో ప్రభావతికి పార్వతి కనిపించి ఒక చిత్రపటం గీసి ఇస్తూ, ఇతనే నీ భర్త. ప్రద్యుమ్నుడనే రాకుమారుడు. మీ ఇద్దరికీ పుట్టే బిడ్డ ఈ రాజ్యానికి రాజౌతాడు అని చెప్పింది.
చిలుక, శుచిముఖి అనే హంస సహాయంతో ప్రద్యుమ్నుడు భద్రుడు అనే నటుడిగా, గదుడు పారిపార్శ్వకుడిగా, సాంబుడు విదూషకుడిగా వజ్రపురి నగరానికి వస్తారు. అక్కడ శుచిముఖి పెళ్ళిమంత్రాలు చదవగా ప్రద్యుమ్నుడు, ప్రభావతికి గాంధర్వ వివాహం జరిగింది. తొమ్మిదినెలల తర్వాత ప్రభావతికి ప్రభావంతుడు అనే కూమారుడు జన్మించాడు. ఈ విషయం తెలుసుకొని వచ్చిన వజ్రనాభుడితో ప్రద్యుమ్నుడు యుద్ధంచేసి వజ్రనాభుడిని అంతం చేస్తాడు.
సూర్యుని భార్య అగు సంజ్ఞాదేవికి నామం. ఈమె ఇంద్రుని పతిగా కోరి తపము ఆచరించుచు ఉండగా అతడు వసిష్ఠుని ఆకృతి తాల్చి కొన్ని బదరీఫలములను ఇచ్చి పక్వముచేయుము అనెను. అందులకు ఒప్పుకొని పక్వము చేయ ఆరంభింపగా అవి ఎంతసేపటికిని పక్వముకాక సేకరించిన కాష్ఠములు అన్ని సమసిపోయెను. అప్పుడు ఈమె, తాను కాష్ఠములను తేబోయిన అగ్ని ఆఱి దుష్పాకము అగును అని ఎంచి, తన కాలు ఇంధనముగా ఇడి పాకము చేయ పూనెను. అంత ఇంద్రుడు మెచ్చుకొని ఆమె కోరిన వరమును ఇచ్చెను. ఈమె తపము ఆచరించిన తీర్థము బదరీపాచనము అనబడుతుంది 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
కామెంట్‌లు