లెక్కల పుస్తకంలో దాచిన నెమలీక;-- జగదీశ్ యామిజాల
 పిల్లల్ని పెట్టలేదుకానీ
గుడ్డు పెట్టింది
అంటే గుండుసున్న పెట్టించిందని!
నెమలీకను పుస్తకంలో పెట్టుకోవడమేమిటీని అడగొచ్చు.
ఈకాలం పిల్లలకు అది తెలియకపోవచ్చు...
నా చిన్నప్పుడు క్లాసులో ఎవరి దగ్గరైనా నెమలీకలుంటే వాటిలో ఒకటి తీసుకుని పుస్తకంలో దాచుకుని ఓ నాలుగైదు బియ్యపుగింజలు పెట్టడం ఓ అలవాటు. అలా పుస్తకంలో ఉంచిన నెమలీక మరిన్ని నెమలీకలను కంటుదని ఓ నమ్మకం. ఆశ. అయితే అలా ఎప్పుడూ జరిగేది కాదు. 
నాకు లెక్కలన్నా ఇంగ్లీషన్నా భయం. అందుకోసం ఈ రెండు పుస్తకాలలో నెమలీకలను దాచేవాడిని. ఇందువల్ల ఏదో కలిసొస్తుందని. కానీ లెక్కల్లో అతి తక్కవ మార్కులొచ్చేవి.  ఓమారైతే గుండుసున్న కూడా తెచ్చుకున్నాను. అప్పుడు లెక్కల మాష్టారు గోపాలాచారిగారు ఆ గుండుసున్న పేపరుని పైకెత్తి పట్టుకుని  అందరికీ చూపించారు. 

కామెంట్‌లు