ఏ కవయినా
ఏమి రాస్తే ఏముంది
ఏ భాషలో రాస్తే ఏమవుతుంది
అందులో
ఎంత దుఃఖం ధ్వనిస్తే మాత్రం ఏముంది
అది తన తల్లికే అర్థం కానప్పుడు
రాసి వున్న కాగితం చేతుల్లోకి తీసుకుని
అక్షారాల్ని అట్లా దీనంగా చూస్తూ
ఆ తల్లి కూలబడింది
నింగికేసీ నేలకేసీ చూస్తూ
ఇదేమిటో మీకయినా తెలిసిందా అని
అమాయకంగా అడిగింది
రాని జవాబుకోసం ఎదురు చూడకుండానే
కన్నబిడ్డల కష్టమో దుఃఖమో అర్థం కావడానికి
నాకూ మీకూ
భాష కావాల్నా
వాళ్ళ చూపు చాలదా
అని గొణిగిందా తల్లి
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి