క్లాస్ లో టీచర్ పాఠం చెప్తారు. కొందరు శ్రద్ధగా విని బాగా ఆకళింపు చేసుకుంటారు.ఇంకొందరు పాస్ ఐతే చాలనుకుంటారు.మరీ ఆసక్తి ఉంటే ఆపిల్లలు వేరే రకంగా ఆలోచించి తర్కిస్తారు.ఇంకొందరు పాఠంని సరిగ్గా అర్ధం చేసుకోలేక తికమక పడతారు. ఇక వేదాంతి చెప్పేమాటలు తమ పరిభాషలో తప్పుగా అర్ధం చేసుకుంటారు. ఆగురువు మంచి దైవభక్తి కలవాడు. తన శిష్యుడికి ప్రతి విషయం వివరించేవాడు.కానీ ఆతలతిక్క శిష్యుడు ఉల్టాపుల్టాగా ఆలోచించేవాడు.నైవేద్యం ఇద్దరు ముగ్గురు దివ్యాంగులకి ఆహారపదార్థాలు ఓ చిరువ్యాపారి అప్పుగా ఇచ్చేవాడు.గురువు ధనం చేతిలో ఉంటే అతని బాకీ చెల్లించేవాడు.ఓసారి ఆచిరువ్యాపారి శిష్యుడి తో"ఏమయ్యా!నెలరోజులు దాటాయి.పాతబాకీ ఇవ్వు. అప్పుడే నీవు కావల్సిన సరుకులు తీసుకుని వెళ్లవచ్చు "అని ఖచ్చితంగా అడిగాడు. "మేము దివ్యాంగులకి ఇద్దరికి పెడుతున్నాము.నైవేద్యం తో నేను బతుకుతున్నాను.మాగురువుగారు ఎవరైనా ఇచ్చే పండు తింటారు అంతే!" ఆజవాబుతో తిక్కరేగిన వ్యాపారి గురువు గారి దగ్గరికి వెళ్లి "స్వామి! నిన్న కూడా నేను 2కె.జి.ల బియ్యం పావు కె.జి.పప్పు పోపు సామాన్లు ఇచ్చాను.ఇప్పుడే మీశిష్యుడు పాతబాకీ చెల్లించకుండా గోధుమ పిండి ఇవ్వమని వచ్చాడు. నాకు సంసారం ఉంది కదా?" అని ఖచ్చితంగా చెప్పగానే" అలా ఎందుకు చేశావు శివా?" అని శిష్యుడిని అడిగాడు. "అయ్యా!గురూజీ! చేసింది మర్చిపో! తిన్నది హరాయించుకో!అని రోజూ మీరు చెప్తారు కదా? అన్నం వండి దివ్యాంగులకి వడ్డిస్తున్నాను.షావుకారు ఇచ్చింది మర్చిపోతున్నాను.అందుకే వ్యాపారి అడిగితే మాట్లాడకుండా సరుకులకోసం చెయ్యి చాస్తున్నాను."గురువు కి వాడి మూర్ఖత్వం పై కోపం వచ్చింది. తన మాటలు వక్రంగా అర్ధం చేసుకున్నాడు!"చూడు శివా!నేను వండి అన్నం పెడుతున్నాను.దివ్యాంగులకి సాయంచేస్తున్నా అనే భావం మర్చిపోవాలి.మంచి మాటలు హరాయించుకోవాలి.అందరిలో దేవుని చూడాలి అని నాబోధనలను ఇలా అన్వయించుకుంటే ఎలా?నీవల్ల వ్యాపారి నష్టపోతున్నాడు. కాకుల్ని కొట్టి గద్దలకు వేయటంకాదు.మనం బాకీ ఉన్న సంగతి నీవు నాకు చెప్పలేదు. వ్యాపారి వల్ల నిజం తెలుసుకున్నాను.శక్తికి మించి ఇంకోరి నెత్తిన చెయ్యి పెట్టి దానం చేస్తే పుణ్యం రాదు.పాపమే మిగులుతుంది."
అని వ్యాపారి అప్పు తీర్చేశాడు🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి