అసలైన మనిషి! అచ్యుతుని రాజ్యశ్రీ


 


గోపి ఓదొంగ!పొట్టకూటికోసం  కక్కుర్తి పడి దొంగతనం చేసేవాడు.పొట్ట నిండితే ఆపని చేసేవాడే కాదు. బాల్యం లో అమ్మా నాన్న చనిపోటంతో బంధువులు ఆపసివాడిచేత వెట్టి చాకిరీ చేయించి మాడిన అన్నంమెతుకులు విదిల్చేవారు.వారి పిల్లలు మంచి దుస్తులు  నోరూరించే చిరుతిళ్లతో చిలోపొలో అంటూ తిరుగుతూ ఉంటే  పసివాడైన గోపి చాకిరీ చేస్తూ పెరిగాడు. వాడిలో కసికూడా పెరిగి పేరుకుపోయింది.పారిపోయి చిన్న సైజు దొంగగా మారాడు.దొంగతనం వల్ల వచ్చి న డబ్బు తో బీద నిస్సహాయులకు ఆహారం  దుస్తులు కొని పంచేవాడు.ఆరోజు దేవుడి కల్యాణం అంగరంగవైభవంగా జరుగుతోంది. గోపి గుంపులో దూరి జేబులు కొట్టేశాడు.ఆపై ఓ చిన్న హోటల్ లో ఇన్నిఆహారపు పొట్లాలు కొని ఓచెట్టుకింద కూచున్న ముసలి దివ్యాంగులకి పంచాడు.కొందరిని జాగ్రత్తగా రోడ్డు దాటించాడు.ఓచెట్టుకింద  పడుకున్నాడు.పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో వెళ్తూ గోపీని చూశారు. "స్వామీ!వాడు చోరుడు!ఐనా వాడు పట్టుబడకుండా  కాపాడుతున్నారు ఎందుకు?"అమ్మవారి ప్రశ్నకు పరమేశ్వరుడు నవ్వుతూ ఇలా జవాబు ఇచ్చాడు "దేవీ!వాడు నిర్మలభక్తితో నన్ను నిత్యం కొలుస్తాడు.అసహాయులకు సాయంచేస్తాడు.భక్తి అనే ముసుగు లో ఆక్యూ లో నించున్న జనం ఎన్ని అవినీతి అకృత్యాలు చేస్తారో తెలుసా? వృద్ధులు దివ్యాంగులను విసుక్కుని చీదరించుకుంటారు.కన్నవారిని పెంచిన వారిని తిండిపెట్టక మాడ్చి రోడ్డు పై వదిలేసే ప్రబుద్ధులున్నారు.ఐనా ఇప్పుడే గోపీకి ఈజన్మనించి విముక్తి కలిగిస్తాను".ఇంతలో దేవుని ఊరేగింపు లో కలకలం రేగింది. "మావీధిలో ముందు ఊరేగింపు రావాలి". "కాదు!మాఇంటిముందు నించి పోవాలి"అని ఇరువర్గాలమధ్య మాటలయుద్ధం ప్రారంభం ఐంది.అరుపులుతో పాటు కర్రలు  రాళ్లతో జనం చావబాదుకోవటంతో కలకలం చెలరేగింది. ఆరాళ్లు చెట్టుకింద పడుకున్న గోపీపై పడి తలచితికి హరీ అన్నాడు. నిజమైన మనిషి తన కుక్షి నింపుకునేందుకై కష్టపడి నీతి న్యాయమార్గంలో బతకాలి.దైవం పేరుతో మోసంచేస్తూ చేసే పూజలు ఫలించవు.తోటిప్రాణిలో దైవంని చూసేవాడే నిజమైన మనిషి 🌷

కామెంట్‌లు