పరిమళ పారిజాతాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 తెల్లని రేకులు  కాషాయకాడతో కమ్మని వాసన వెదజల్లే  పారిజాతాలు ఇప్పుడు బాగా పూస్తాయి.తెల్లారితే చాలు నేలపై నక్షత్రాలు లాగా రాలి ఘుంఘుం వాసనతో హాయిని కల్గిస్తాయి.ఇప్పుడు బాగా పూసేకాలం.చాలా సున్నితం.మనం దండగుచ్చేలోపే నలిగి వాడిపోతాయి. హిందీ లో రాత్ రాణి  హరిసింగార్ అని పిలుస్తారు. ఈపూలు ఆకులు  యాంటీ ఇన్ఫ్లెమెంటరీ యాంటీ బ్యాక్టీరియల్  యాంటీ ఆక్సిడెంట్ గా ఓషధీగుణాలు కలిగి ఉంది. ఇమ్యూనిటీ బూస్టర్!డెంగూ మలేరియా  చికెన్ గున్యాకి దివ్య ఔషధం!ఆయుర్వేదం లో దీన్ని గూర్చి వివరణ ఉంది. 🌹
కామెంట్‌లు