గజల్ (తిశ్రగతి);-సి.హేమలత( లతా శ్రీ )పుంగనూరు
తీయనైన అమృతములు 
పలికి చూడు తెలుగు భాష/
జనపదాల జావళీలు
 మలచి చూడు తెలుగు భాష//

తల్లిబాష మాధుర్యము జనాళికీ 
 అందించుము /
పరదేశి వ్యామోహము 
వదిలి చూడు తెలుగు భాష//

వెలుగు జిలుగు ఉల్లాసము
 పొంగించును ప్రతి క్షణము/
గోరుముద్ద మురిపాలను 
కొసరి చూడు తెలుగు భాష//

నిదురలోనుఅల్లించును
అదరమందు కవిత్వాలు/
క్షరములేని పరవశమే
 పొంది చూడు తెలుగు భాష//

అమరమైన ఆకృతులే 
అజంతాన గోచరించు/
ప్రతి మనసు అనుభవమే 
తడిమి చూడు తెలుగు భాష//

చలోక్తుల సరదాలతొ 
పదనిసలే పలుకు నందు/
సుమనోహర బంధాలను
చిలికి చూడు తెలుగు భాష//

పద్యాలను హేమలతకు
 తెలిపెనులే అమ్మ భాష/
మమకారపు మధురిమలే
పిలిచి చూడు తెలుగు భాష//



కామెంట్‌లు