సునంద భాషితం ;-వురిమళ్ల సునంద ఖమ్మం
 తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు 
============================
బలగం... భాగ్యం.. 
  ******
 "బలగమైనా ఉండాలి భాగ్యమైనా ఉండాలి" అంటారు పెద్దలు.
బలగమంటే ఏ బలగం.?
 బలగమంటే పుట్టింటివారో, అత్తింటి వారో రక్త సంబంధంతో కూడిన వారని కాదు...
ఆపదలో ఆదుకునే ఆప్త బలగం. అన్ని వేళలా మేమున్నాం అనే భరోసా బలగం. సమయానికి  సహకరించే బలగం.బాధల్ని ఉపశమింపజేసి,  ధైర్యాన్ని నింపుతూ, మంచి పనులకు ప్రోత్సాహం ఇచ్చే మమతానురాగాల మానవతా హృదయ బలగం.
భాగ్యం అంటే సంపద. కొందరు ఆ సంపదను చూసుకుని మురిసిపోతూ ఉంటారు.ఆ భాగ్యంతో  ఏదైనా చేయగలమనే భ్రమలో, చిటికెస్తే జీ హుజూర్ అని వస్తారనే ధీమాతో, సంపదను మించినది ఏదీలేదనే అహంతో ఉంటారు.
 ఆప్తత,ఆదరణీయత, సహృదయత లేకుంటే  ఎంత సంపద ఉన్నా ఎవరూ వారికి చేరువ కాలేరనే  సత్యాన్ని గ్రహించే లోపు మానసికంగా ఒంటరి అవడం తధ్యం.
భాగ్యం కంటే బలగం ఎంత గొప్పదో ... ఆ బలగం ఉన్న వాళ్ళను గమనిస్తే తెలుస్తుంది.
ఆత్మీయత అభిమానం పంచే పైన బలగం లాంటి బలగం ఉంటే చాలు..ఈ సమాజంలో ఆనందంగా ఆత్మ తృప్తితో బతకడానికి..
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు