నిద్రిస్తున్న ఆకాశం
ఉలిక్కి పడిలేచింది
తూరుపుదిక్కున
రక్తవర్ణం !
******
ఎరుపుదుప్పటిని
తొల గిస్తూ ...
భాస్కరుడు లేచాడు
డ్యూటీకి టైమైంది !
.. ***&***
నీలాకాశం..
నిద్రకుపక్రమిస్తోంది !
చంద్రుడు-చుక్కలు ...
పహారాకు సిద్ధం !!
*******
వేకువజాము...
మొక్కలన్నీ
మిల - మిల మెరుస్తూ
తుషార స్నానం చేశాయి
. ******
పరవశిస్తూ ...
పులకించింది కాగుచెట్టు....
క్రింద నేలనిండా...
పూల పాన్పు .!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి