స్వేఛ్చా భారతి;- డా.. కందేపి రాణీప్రసాద్.
స్వేఛ్చా భారతీ ! స్వర్ణోత్సవ భారతీ!
నీకిదే మా మహిళల హారతి!

డయానా అందం
జిజియా ప్రేమ
నైటింగేల్ ఆప్యాయత
మదర్థెరిస్సా త్యాగం
అందిపుచ్చుకున్న అమ్మలం
ప్రేమకు మరో రూపాలం ::స్వేఛ్చా::

రుద్రమ్మ రౌద్రం
ఝాన్సీ దైర్యం
ఇందిరమ్మ పాలనం
కిరణ్ బేడి శౌర్యం
పుణికిపుచ్చుకున్న వారసులం
ఏదైనా చేయగల సాహసులం ::స్వేచ్చా::

తల్లిగా, చెల్లిగా, చెలిగా
కుటుంబాన్ని ప్రేమించగలం
ప్రపంచదేశాలలో భారత్ ను
అగ్రగామిగా నిలుపగలం
జై భరతభూమి! జై భరతభూమి!
జై భరత భూమి! జై భరత భూమి! ::స్వేచ్చా

కామెంట్‌లు