@ సమాయత్తం చేస్తుంది @ కోరాడ నరసింహా రావు

 వేకువ తుషార స్నానంతో... 
శుద్దిచేసుకున్న హరిత పత్రములు... !
శోభాయమాన ప్రకృతిగా... 
మనసును ఆహ్లాద పరుస్తుంటే 
నరాల్లో నవ చైతన్యమేదో ప్రవహించి ఉల్లాసం ఉప్పొంగుతోంది !
వేకువకున్న మహత్తే అంత !
లేలేత కిరణాల మేల్కొల్పు తో 
జగతి పునరంకితానికి శ్రీకారం చుట్టి...కర్తవ్యనిష్ఠకు 
సమాయత్తం చేస్తుంది !
    *******
కామెంట్‌లు