కోసల దేశాన్ని మగధ సేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు ప్రతీరోజు సద్గ్రంధాలు చదివి అప్పుడు వచ్చే సందేహాలను కుల గురువుతో చర్చించి తీర్చుకునేవాడు.
ఒక సందర్భంలో ఒక గ్రంథం చదువుతున్నప్పుడు మానవాళిని పట్టి పీడించేది ఆశ అని, అయితే ఆశ వుండవచ్చు గాని దురాశ మాత్రం వుండకూడదని, దురాశ మానవాళిని అధమ పాతాళానికి దిగజార్చేస్తుందని చదివాడు. తన రాజ్యంలో దురాశపరులు ఎంతమంది వున్నారో తెలుసుకోవాలని అనుకున్నాడు.
ఈ విషయాన్ని కులగురువుతో చర్చించినప్పుడు,ఆయన ఒక అమోఘమైన ఉపాయం ఇచ్చారు..
ఆ ప్రకారంగా మర్నాడు " రాజ్యంలో పౌరులందరికీ కొంత భూమి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫలానా రోజు, ఫలానా సమయానికి భూమి కావాల్సిన వారు రాజధానికి రావాలని " దండోరా వేయించారు.
అనుకున్న రోజు రాజ్యంలో లక్షలాది పౌరులు రాజ ప్రాకారం ముందు చేరారు. నేల ఈనినట్లు వున్న ఆ జన సమూహాన్ని చూసిన మహారాజుకు మతి పోయినట్లయ్యింది. ఉచితంగా భూమి అనేసరికి దానిని సాగు చేసుకోగలమా లేదా అని కూడా చూడకుండా అక్కడ చేరిన లక్షలాది జనాభాను చూసాక ఆశ ఎంతటి బలవత్తరమైనదో ఆయనకు స్పష్టంగా అర్ధమయ్యింది.
సూర్యోదయం తర్వాత రెండు ఘడియలకు మహారాజు తన రథంలో వచ్చి దిగాడు. ఆయన అనుమతితో ప్రధాన మంత్రి ‘‘ప్రియ ప్రజలారా! మహారాజు తెల్ల జెండా ఊపగానే మీరు గీత గీచిన ప్రాంతం నుంచీ కదిలివెళ్ళి సూర్యాస్తమయానికి మీరు ఎన్ని అడుగులు నడుస్తారో అంత భూమి మీకు ఉచితంగా మహారాజు ప్రదానం చేస్తారు’’ అని ప్రకటించాక మహారాజు జెండా ఊపారు.
ప్రజలంతా హుషారుగా నడక సాగించారు. కొందరు నడుస్తుంటే, మరికొందరు పరుగులు తీయడం ప్రారంభించారు. ఆ వేళ ఎండ ఎక్కువగా వుంది. అయినా కొందరు ఎండను లెక్క చేయకుండా నడుస్తునే వున్నారు. అందరిలో ఒక్కటే పట్టుదల. సాయంత్రం వరకు సాధ్యమైనంత దూరం నడిచి భూమిని స్వంతం చేసుకుంటే లక్షాధికారులం అయిపోవచ్చు. ఇక మిగితా జీవితంలో ఏ పని పాటు చేయకుండా తిని కూర్చోవచ్చునన్నదే వారి ఆశ.
విచిత్రం గా కొంత మంది ప్రధాన మంత్రి సూచనలను సరిగ్గా వినకుండా సూర్యాస్తమం అయినా నడుస్తునే వున్నారు. ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకొనక రాత్రంతా నడుస్తునే వున్నారు. వేగుల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న మహరాజు వారి ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. దీనినే దురాశ అంటారని కులగురువు రాజుకు బోధించాడు.
తెల్లవారేసరికి పదిహేను మంది వివిధ ప్రాంతాలలో చచ్చి పడి వున్నారని వేగులు తెలిపారు. ప్రజలంతా వారి దురాశకు ఆశ్చర్యపోయి.. ఆశ మోతాదులో వుండాలే కాని, అది హద్దులు దాటి దురాశగా మారితే మనుష్యులను అధమ పాతాళానికి దిగజారుస్తుందని అందరూ తెలుసుకున్నారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి