రాచపల్లి ఉన్నత పాఠశాలలో "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచపల్లి,ఇల్లందకుంట మండలంలో "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" కార్యక్రమాల్లో భాగంగా నేతాజీ స్కౌట్ ట్రూప్ విద్యార్థులు 75 మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో 20 మంది స్కౌట్ లు  పాఠశాల ఆవరణలో గల గాంధీ విగ్రహం చుట్టూ పరిశుభ్రంచేసి పూల మొక్కలు నాటారు...అంతేకాకుండా పాఠశాల ఆవరణలో 75 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎ వెంకట రమణారెడ్డి గారు గాంధీ విగ్రహం ఎదుట మొక్కను నాటి కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్కౌట్ మాస్టర్ అడిగొప్పుల సదయ్యతో పాటు ఎం సదానందరెడ్డి,మూనా,శారద,సునీత ఉపాధ్యాయులు పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.


కామెంట్‌లు