నామొత్తం జీవితం అరవై సంవత్సరాలూ పార్వతీపురం లోనే గడిచిపోయాయి !
నాకు ఊహ తెలిసిన దగ్గర నుండీ... మా అమ్మ వినాయక చవితివచ్చిందంటే....,మాఊరిలో ఉన్న ఏకైక గణేష మందిరానికి తీసుకు వెళ్ళేది !
నా చిన్నతనంలో ఆమందిరం మా పార్వతీపురం బెలగాం నుండి టౌన్ కి వచ్చేతోవలో వరహాలగెడ్డ ప్రక్కనే వేణుగోపా ల్ సినిమా హాలు, ఆహాలుప్రక్కనేపాకలో చెల్లయ్య హోటలు ఆ హోటలుకుఎదురు గారోడ్డుకిఆవలివైపుపెద్దచెరువు
ఆచెరువునానుకునే చిన్నవినా
కునిగుడిఅది! వినాయకచవితి
వచ్చిందంటే... ఊరు ఊరంతా
ఆ నవరాత్రుల్లో వీలైన రోజుల్లో దర్శించి పూజలు చేయించుకుం డేవారు !
మాకైతే వినాయకచవితి ఇంటి వద్ద చేసే ఆనవాయితీ లేదు!
మాఅమ్మవినాయకచవితిరోజున ఉదయాన్నే మాచేతతలస్నా నాలు చేయించి, సోలడో, తవి డో బియ్యము, ఒ పెద్ద బెల్లం ముక్క,కొబ్బరికాయ,అరటిపళ్ళు వగైరా పూజాసామాగ్రితో ఆ వినాయకుని గుడికి తీసుకు వెళ్లి పూజ చేయించి, విద్యా, బుద్ధులనిమ్మని మొక్కమనేది!
తరువాత కొన్నేళ్ళకి ఊరిలోఒక టి, రెండుచోట్ల బాగా పెద్దవి వినాయక విగ్రహాలను పెట్టి నవరాత్రులు చేసేవాళ్ళు ప్రతిరోజూ ఏవేవో మంచి ప్రోగ్రాములు పెట్టించేవాళ్ళు !
ఇంకాఊరిలోచాలాచోట్లపెద్ద,
పెద్ద విగ్రహాలుపెట్టి నవరాత్రులు
చేసేవాళ్ళు
అన్నివీధులవిగ్రహాలూమొదట
వినాయకుని గుడిదగ్గరినుండే..
లారీల మీద,తోపుడుబల్లమీదా
డప్పులు,డాన్సులతోగొప్పకోలా హలంగా...ఊరేగింపుగా బయలుదేరి ఆయాస్థలాలకు చేరుకునేవి ! ఏదో ఒకరోజో, రెండురోజులో మా అమ్మ బటానీలో, చెనగలో మావీధి వినాయకునికి పూజాద్రవ్యా లతో సహా పంపేది !
వినాయకచవితి, దసరాలు
వచ్చాయంటే పిల్లలకు సందడే సందడి ! మళ్ళీ ఆ బాల్యపు రోజులు రమ్మంటే రావు కదా !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి