అనుమానం! అచ్యుతుని రాజ్యశ్రీ

 అనుమానం పెనుభూతం! మనల్ని మానసికంగా దెబ్బ తీయడానికి కొంత మంది ప్రయత్నాలు చేస్తారు. రోజూ అదేపనిగా చెవిలో జొరీగ లాగా రొద పెడుతుంటే ఆనెగిటివ్ భావాలు మనబుర్రలో దూరి పనిచేస్తాయి. అందుకే శుభంపలకరా మంకెన్నా అనే మాట పుట్టింది. ఆరోజు ప్లీడరు రామసుబ్బారావు గారి గుమాస్తా గోపయ్య రాలేదు.రేపు దెయ్యాల ఆచారి కేసు ఉంది. ఎందుకు రాలేదా అని  కబురంపితే జ్వరంతో బాధ పడుతున్నాడు గోపయ్య  అని తెలిసింది. వారం రోజులు గడిచినా గోపయ్య పరిస్థితి లో మార్పు లేదు. తమ డాక్టరు ని తీసుకుని స్వయంగా ప్లీడరు అతనింటికి వెళ్లాడు. గోపయ్య దేనికో భయపడుతున్నాడు.వైద్యుడి మందులు పని చేయటం లేదు. ఆరోజు ఆచారి తెల్లారుతూనే "పంతులు గారూ!"అంటూ వచ్చాడు. "నేను ఓవారం ఊరికెళ్లి వస్తాను." "ఏమయ్యా ఆచారీ! మాగుమాస్తా గోపయ్య కి సుస్తీగా ఉంది. కాస్త విభూది తాయెత్తు ఇవ్వు" "ఆహా ! మరి నాతో అనవసరంగా నోరు పెడ్తే అంతే సంగతులు! ఓవంద తన చేతిలో పెట్టమన్నాడు.ఓపాతిక ఇచ్చాను.దెయ్యాల మాంత్రికుడివి.మొత్తం ఇవ్వు అని అవాకులు చెవాకులు పేలాడు.ఆసాయంత్రం తన పొలం వెళ్లి తిరిగి వస్తున్న గోపయ్యకి దారిలో పెద్దకాగడా వెలిగించి ఆచింత చెట్టుపై కూచున్నాను.అసలే గాలి మొదలు సన్నటి చినుకులు! రాత్రికి నీపొలం దగ్గరికి కొరివిదెయ్యం ని పంపుతా అని  సవాల్ విసిరాను.పాపం! ఆదెబ్బతో  గోపయ్య మంచం ఎక్కాడు పంతులు గారు!" "నాగుమాస్తా ను భయపెట్టి నా కోర్టు వ్యవహారాలు వాయిదా వేస్తే ఎలాగా?" అని నవ్వారు ప్లీడరు. జరిగింది ఏంటంటే  మానసికంగా  ఆచారి గోపయ్య ను దెబ్బ తీశాడు. ఇదే మనం తెలుసుకోవాలి.పొద్దుగూకులూ "చెడు జరుగుతుంది-నేను చేయలేను"అనరాదు. పిల్లలని కూడా "నీవు ఇంతే!ఎన్ని సార్లు చెప్పినా బుర్రకెక్కదు."అని సైకలాజికల్ గా వారిని అంటే అదే వారి మనసులో ఉండిపోతుంది 🌷
కామెంట్‌లు