విగ్రహం!(నేపాలీ కథ ఆధారంగా) అచ్యుతుని రాజ్యశ్రీ

 నేపాల్ రాజధానిలో ఏనుగు అంబారీపై బుద్ధుని విగ్రహాన్ని ఊరేగించి రాజదర్బారులో పెట్టారు. బంగారు పూతతో మెరిసిపోతోంది ఆవిగ్రహం! పొరుగు రాజ్యంపై దాడిచేసి అక్కడి ధనరాసులతో పాటు  అపురూప విగ్రహాన్ని తెచ్చాడు రాజు. అతని కళ్ళకి అది ఓ అలంకార వస్తువు అంతే!కానీ మంత్రి చకణుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.దాన్ని ప్రదర్శనశాలలో పెడతారని తెల్సి నిరాశచెందాడు.చాలా నిరుపేద కుటుంబం లో పుట్టిన  మంత్రి తనకులవృత్తి శిల్పకళలో మెలుకువలన్నీ తాత దగ్గర నేర్చుకున్నాడు.బాల్యంలోనే అమ్మా నాన్న లు చనిపోయారు. తాత గొప్ప శిల్పా చార్యుడు.తాత కూడా కన్ను మూయటంతోపదహారేళ్ల చకణుడు  నేపాల్ చేరాడు.చిన్న చిన్న  కాలువలపై వంతెనల కట్టడం చిన్న విగ్రహాలు చెక్కుతూ  అక్కడ అందరి దృష్టిని ఆకర్షించాడు.అతని ప్రతిభ రాజు చెవిన సోకటంతో అతని సుడితిరిగింది.పాతికేళ్ళ వయసులో రాజు దర్బార్ లో కొలువు తీరాడు.పెళ్లి ఐంది.అత్తింటి వారు బౌద్ధమతం ని అభిమానించేవారు. ఆప్రభావమే చకణుని పై పడింది. ఏళ్ళు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేసినా ఫలంశూన్యం! ఆదిగులుతో భార్య కన్నుమూసింది. సరిగ్గా అప్పుడే  చకణుడు అంటే గిట్టనివారు  అసూయతో అతనిపై కుట్రలు పన్నసాగారు.అతనిపై రాజు కి  కొండేలు చెప్పసాగారు.తనసొంత ఖర్చు తో చిన్న గుడి కట్టే పనిలో పూర్తిగా నిమగ్నమై పోయాడు చకణుడు!
ఇంతలో పొరుగునే ఉన్న రాజు  నేపాల్ పై దండెత్తే సన్నాహంలో ఉన్నాడని జంబూకవర్మ అనే మంత్రి రాజు లో ఊదాడు."మరి వర్షాకాలం!ఏక్షణాన వాగులు వంకలు పొంగుతాయో!? సైన్యం దారిలో వరద బురదలో చిక్కుకుంటే ప్రమాదం ప్రభూ!ఐనా చకణుని సలహా కూడా తీసుకోండి. అతను మంచి సలహా ఇస్తాడని మీనమ్మకం గదా?" వ్యంగ్యం మిళాయించి మనసులో ముసిముసినవ్వు తో తనకి తందానతాన అనే భజనపరులవైపు చూశాడు.వారందరికీ చకణుడు అంటే కడుపు లో మంట!అసూయ!ఓసామాన్య రాతిచెక్కడం పనులు చేసేవాడు  మంత్రులతో సమానంగా గౌరవింపబడటం నచ్చటంలేదు.ఈయువకునికి రాజు విలువ ఇవ్వడం అస్సలు నచ్చలేదు. చకణుడు అన్నాడు "ప్రభూ!ఈవర్షాకాలమే సరైన సమయం! శత్రువు అస్సలు ఊహించడు మనం దాడి చేస్తామని.మనం గెలవటం సులభం!" రాజుకి అతని మాటనచ్చి చకచకా సైన్యం కి కావల్సిన ఏర్పాట్లు చూడమని  చకణుని కే అప్పగించాడు.దానితో మిగతా మంత్రుల కి కడుపులో మంట భగ్గుమంది.చకణుని కి తగిన శాస్తి జరగాలనే కుళ్ళు బుద్ధి వారిది!పైకిమాత్రం "ఆహాహా!మేము నీముందు దిగదుడుపే!" అని రాజు కి తమనక్క బుద్ధి తెలీకుండా జాగ్రత్త పడ్డారు.అనుకున్నట్లే  రాజు సైన్యం  వరదలో చిక్కుకుంది. జంబూకవర్మ  అగ్గి మీద గుగ్గిలం చల్లాడు."మనసైన్యం పని చిత్తు"అంటూ! అంతానిరాశ లో మునిగారు. రాజు  మంత్రి తో అన్నాడు "నీవు చెప్పింది నిజం!అనవసరంగా శిల్పి మాటలువిని గోతిలో పడ్డాం."చకణుడు పల్లెత్తు మాట  అనకుండా నిశ్చలభక్తితో తన చేతికున్న ఉంగరాన్ని ఆ వరదనీటిలో విసిరాడు. ఆపై తన బంగారు కంకణాన్ని కూడా నీటిలో విసిరాడు. ఆశ్చర్యం! ఉంగరం తో పాటు కంకణంకూడా తిరిగి చకణుని దగ్గరకు చేరింది. అంతే సైన్యం లో ఉత్సాహం పొంగిపొర్లింది. కనికట్టు మాజిక్ లాగా వరదనీరు నిముషం లో మాయంకావటం శత్రువు పై దొంగదెబ్బ తీయటం జరిగింది. నేపాల్ సైన్యం జయజయధ్వానాలతో చకణుని ఆకాశానికి ఎత్తటంతో జంబూకవర్మ అతని అనుచరుల మొహాలు మాడిపోయాయి.కానీ రాజు కి దుర్బోధ చేశారు"ప్రభూ!చకణుని దగ్గర మంత్రోపదేశం పొందండి "అని.కానీ చకణుడు స్థిరంగా అన్నాడు "ప్రభూ!మాతాత నేర్పిన ఆవిద్య కేవలం వైరాగ్యం చెందిన వారికే ఫలిస్తుంది.బాల్యంలో సాధనచేశాను.సంపూర్ణ వైరాగ్యం తో  బికారిగా మారాను.నాకు సెలవు ఇప్పించండి.మీకొలువు నించి  తప్పుకుని నాశేషజీవితం నేను కట్టుకున్న ఆచిన్న ఆరామంలో బౌద్ధ భిక్షువు గా మారి బతుకుతాను.ఆబుద్ధ విగ్రహం ఇవ్వండి  చాలు!" అని కోరాడు.రాజు చేసేది ఏమీలేక  పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు🌹
కామెంట్‌లు